Sri Krishna Melukolupu | శ్రీ కృష్ణుని మేలుకొలుపు

Sri Krishna Melukolupu
శ్రీ కృష్ణుని మేలుకొలుపు

We are delighted to present a beautiful rendition of the traditional Telugu devotional song “Sri Krishna Melukolupu,” performed by the renowned Sri Thatavarthi Atchuta Rao Garu. This divine song is meant to be sung in the morning to wake up Lord Shree Krishna, filling your day with divine blessings and positivity.

 

కేశవ యని నిన్ను- వాసిగ భక్తులు  వర్ణించుచున్నారు – మేలుకో
వాసవ వందిత – వసుదేవ నందన వైకుంఠ వాసుడా -మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

నారాయణా నిన్ను – నమ్మిన భక్తుల కరుణ బ్రోతువు వేగ –  మేలుకో
శరణన్న రక్షణ – బిరుదు నీకున్నది శశిధర సన్నుతా – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

మాధవ యని నిన్ను – యాదవులందరు మమత గొల్తురు దేవ – మేలుకో
చల్లని చూపుల – మెల్లగా బరపెడు నల్లని నాస్వామి – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

గోవింద యని నిన్ను –  గోపికలందరు గోపాలయని పిల్తురు – మేలుకో
వెన్నముద్దలు చల్ది – వేడుకగా తిన్నా వేణుగోపాలుడవు – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

విష్ణు రూపము దాల్చి – విభవము నగుపించు విష్ణుస్వరూపుడ – మేలుకో
దుష్టసంహారక – దురితము లెడబాపు సృష్టి సంరక్షక – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

మధుసూదన నీవు – మగువ తోడుత గూడి మరచి నిద్రించేవు – మేలుకో
ఉదయార్క బింబము – ఉదయించు వేళాయె వనరుహ లోచన – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

త్రివిక్రమా యని – శుక్రాదు లందరు విక్రమ మందురు – మేలుకో
శుక్రాది గ్రహములు – సుందర రూపము చూడ గోరుచున్నారు – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

వామన రూపమున – భూదాన మడిగిన పుండరీకాక్షుడా – మేలుకో
బలిని నీ పాదమున – బంధన జేసిన కశ్యప నందనా – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

శ్రీధర గోవింద – రాధా మనోహర యాదవ కులతిలక – మేలుకో
రాధా వధూమణి – రాజిలక నంపింది పొడ చూతువుగాని – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

హృషీకేశ యీ భువియందు – ఋషులందరు వచ్చి కూర్చొన్నారు – మేలుకో
వచ్చినవారికి – వరములు కావలె వైకుంఠ వాసుడా – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

పద్మనాభ నీదు – పత్ని భాగాదులు వచ్చి కూర్చున్నారు – మేలుకో
పరమ తారకమైన – పావన నామము పాడుచు వచ్చిరి – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

దామోదరా యని – దేవతలందరు దర్శించ వచ్చిరి – మేలుకో
భూమి భారము మాన్ప- బుధుల బ్రోవను రావె భూకాంత రమణుడా – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

సంకర్షణ నీవు – శత్రు సంహార మొనర్ప సమయమై యున్నది – మేలుకో
పంకజాక్షులు నీదు – పావన నామము పాడుచు వచ్చిరి – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

వాసుదేవా నీకు – భూసుర పత్నులు భుజియింప దెచ్చిరి – మేలుకో
భూసురంబుగ యాగ – సంరక్షణ కొరకు వర్ణింపుచున్నారు – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

ప్రద్యుమ్న రూపుడ – అర్జున వరదుడ దుర్జన సంహార – మేలుకో
అబ్జవంశము నందు – ఉద్భవించిన కుబ్జ నాదరించిన దేవ – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

అనిరుద్ధ యని నిన్ను – అబ్జ భవాదులు అనుసరింప వచ్చె – మేలుకో
అండజ వాహన – అబ్ధి గర్వాంతక దర్భ శయన వేగ – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

పురుషోత్తమా యని నిన్ను – పుణ్యాంగన లందరు పూజలు జేతురు – మేలుకో
పురుహూత వందిత – పురహర మిత్రుడ పూతన సంహార మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

అధోక్షజ మిమ్ము – స్మరణ జేసిన వారి దురితము నెడబాప – మేలుకో
వరుస తోడత మిమ్ము – స్మరణ జేసినవారి వందన మొసగెద – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

నారసింహ నిన్ను – నమ్మిన భక్తుల కరుణ బ్రోతువు వేగ – మేలుకో
శరణన్న రక్షణ – బిరుదు గల్గిన తండ్రి శశిధరసన్నుతా – మేలు కో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

అచ్యుతా యని నిన్ను – సత్యముగ వ్రతవిధులు కొనియాడవచ్చిరి – మేలుకో
పచ్చని చేలమూ – అచ్చంగ దాల్చిన లక్ష్మీ మనోహర – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

జనార్దనా నీవు – శత్రు సంహార మొనర్చ సమయమై యున్నది – మేలుకో
పంకజాక్షులు నీదు – పావన నామము పాడుచు వచ్చిరి – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

ఉపేంద్రా యని నిను – నువిదలందరు గూడి యమున తీర మందున్నారు – మేలుకో
గోపీకాంతలు నీదు – రాక గోరుచున్నారు మురళీ నాద వినోద – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

హరి యని నిన్ను – కొనియాడ గోపికా జనులంత వచ్చిరి – మేలుకో
అష్టభార్యలు నీదు – రాక గోరుచున్నారు వనమాలికాధర – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

శ్రీకృష్ణా యని నిన్ను – గోపాల బాలురు బంతులాడ వచ్చిరి – మేలుకో
కాళీయ మర్దన – కౌస్తుభ మణిహార కంస సంహరణా – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

శ్రీరామ యని మునులు – స్థిరభక్తితో మిమ్ము సేవించు చున్నారు – మేలుకో
తాటకా సంహార – ఖరదూషణాంతక కాకుత్థ్స కుల రామా – మేలు కో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

తెల్లవారవచ్చె – దిక్కులు తెలుపొందె నల్లని నాస్వామి – మేలుకో
వేళాయె గోవుల – మందకు పోవలె గోపాల బాలుడా – మేలుకో
॥ కృష్ణా తెలవార వచ్చెను ॥

This video is part of our “Melukolupu” playlist, dedicated to morning devotional songs that awaken the divine within us. Start your day with this serene and uplifting song, and experience the divine presence of Lord Krishna.

🙏 Listen, Enjoy, and Subscribe to Bhakthi Unlimited for more devotional content! 🙏

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

#SriKrishnaMelukolupu #MorningDevotionalSong #ThatavarthiAtchutaRaoGaru #BhakthiUnlimited #TeluguDevotionalSongs #Melukolupu #LordKrishna #DivineMorning #SpiritualAwakening #DevotionalMusic

Discover Divine Melodies with Bhakthi Unlimited’s Devotional Songs Collection


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply