శ్రీ రాజ రాజేశ్వరీ దండకం || Sree Raja Rajeswari Dandakam

Sree Raja Rajeswari Dandakam

శ్రీ రాజ రాజేశ్వరీ దండకం || Sree Raja Rajeswari Dandakam

శ్రీ రాజ రాజేశ్వరీ దండకం ఒక శక్తి మంత్రం, మహాదేవి రాజ రాజేశ్వరి అమ్మవారి మహిమాన్విత గుణాలను కీర్తించే పూజా స్తోత్రం. శ్రద్ధగా, భక్తితో ఈ దండకం చదివితే అమ్మ వారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ పాట వింటూ మనసును శాంతి, సంతోషం, పాజిటివ్ శక్తులతో నింపుకోండి.

శ్రీ మాత్రే నమః

శ్రీ రాజరాజేశ్వరీ దండకం

శ్రీమన్మహాదేవు రాణి నతేంద్రాణి రుద్రాణి శర్వాణి కల్యాణి దాక్షాయణీ శూల పాణి

పృథుశ్రోణి ధూమ్రాక్ష సంహారిణి పారిజాతాంచిత స్నిగ్ధ వేణీ లసత్కీర వాణీ

భవానీ శివాశాంకరీ రాజరాజేశ్వరీ గౌరి శాకంబరీ కాళి కంకాళి రాజీవనేత్రి

సుచారిత్రి కళ్యాణగాత్రీ మహాదైత్య జైత్రీ నగాధీశపుత్రీ జగన్మాతా లోకైక

విఖ్యాత గంధర్వ విద్యాదరాధిత్య కోటిరకోటి స్ఫురద్దివ్యమాణిక్యదీప

ప్రభాత్యుల్ల సత్పాద కంజాత కేయూరహారాంగదాది జ్వల ద్భూషణవ్రాత

కౌమారి మహేశ్వరీ నారసింహీ రమా వైష్ణవీ భైరవీ దుర్గ కాత్యాయనీ పార్వతీ

నీదు సామర్థ్యమెన్నంగ బ్రహ్మాదులున్ శేషభాషాదులన్ జాల నేనెంతవాడన్

ప్రశంసింపనే తద్జగజ్జాల సంరక్షణారంభ సంరంభ కేళీ వినోదంబులన్

గల్గి వర్తింతు వెల్లప్పుడో యాదిశక్తి పరంజ్యోతి నారాయణీ భద్రకాళీ శుక శ్యామలా

భ్రామరీ చండికాలక్ష్మి విశ్వేశ్వరీ రాజరాజేశ్వరీ శాశ్వతైశ్వర్య సంధాయినీ

యంచు నిన్నెంతయు సన్నుతు ల్సేయ లోకాళికి సంత తాఖండ

దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంసిద్ధి గావింతు వశ్రాంతమున్ రక్త బీజాది

దైత్యేయులన్ ద్రుంచి బృందారకశ్రేణి రక్షింతు నీవెప్పుడున్ నారదా గస్త్య

శాండిల్య మాండవ్య మైత్రేయ జాబాలి కణ్వాది మౌనీంద్రులత్యంత

నిష్టాగరిష్టాత్ములై హృత్సరోజంబులన్ ధ్యానముల్ సేయుచున్ జంద్రఖండా

వతంసా భవద్దివ్య రూపంబు బ్రహ్మాండభాండంబులున్నిండి వెల్గొందునే

తత్ప్రపంచంబు సర్వంబు నీవై ప్రవర్తింతు నీసూర్యచంద్రాదులున్ భూజలా

కాశవాతాగ్ని జీవాత్మలున్నీవ నీకంటేవేరైన దింతైనయున్లేదు యుష్మత్కటాక్షా

ర్హులైనట్టి వారుల్ కడున్ ధన్యులై మాన్యులై పూజ్యులై గణ్యులై యుందురీ

ధాత్రీలో నేను మూఢుండ గర్వాధిరూఢుండ దుశ్చిత్తుడన్ మత్తుడన్ జ్ఞాన

హీనుండ దీనుండ నే జేయు నేరంబులన్ గాచి రక్షింపగా భారమే తల్లి

సద్భక్తమందారవల్లీ నమశ్చంద్ర బింబాననోత్కుండలాత్రాత భూమండలా

సూర్య చంద్రోజ్జ్వలాకామదాచండికా నమస్తే నమస్తే నమస్తే నమః

Sree Raaja Raajeswari Dandakam is a powerful chant dedicated to Goddess Raaja Raajeswari, glorifying her divine qualities. Reciting or listening to this Dandakam with devotion is believed to bring the blessings of the goddess. Immerse yourself in the peaceful and uplifting energy of this sacred chant. If you enjoyed this video, please like, share, and subscribe to our channel. Your support helps us bring more spiritual and devotional content to you.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

Hashtags: #SreeRaajaRaajeswariDandakam #RaajaRaajeswariGoddess #ShaktiWorship #HinduDevotional #DivineChants #SpiritualSongs #TeluguDevotionalSongs #SacredMantras #TeluguStotras

Discover Divine Melodies with Bhakthi Unlimited’s Devotional Songs Collection


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply