Sree Jnana Saraswathi Bhakthi Dhara Stotram | శ్రీ జ్ఞాన సరస్వతి భక్తి ధారా స్తోత్రం

Sree Jnana Saraswathi Bhakthi Dhara Stotram

Sree Jnana Saraswathi Bhakthi Dhara Stotram
శ్రీ జ్ఞాన సరస్వతి భక్తి ధారా స్తోత్రం

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన దేవత. తెలంగాణలో ఉన్న బాసర ఆలయం, విద్యార్థులకు ప్రత్యేకంగా శుభకరమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం ద్వారా చిన్న పిల్లల విద్యారంభం ప్రారంభమవుతుంది. శ్రీ సరస్వతి దేవి ప్రతిదిన పఠనం చేయడం వలన విద్యా జయం, జ్ఞానం, సృజనాత్మకత, మెదడు తేజస్సు కలుగుతాయి. విద్యార్థులు భక్తి ధార స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వలన చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు

శ్రీ మాత్రే నమః

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తి ధారాస్తోత్రమ్

విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్

పంచామృతాభి షేకేన కామిత ఫలదాయికామ్
నైవేద్య నివేదనేన సకలార్ధ సాధి కామ్
నీరాజన దర్శనేన సకలార్ధ సాధికా మ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్

తవ పాదాబ్జ స్పర్శనం పాపహరణమ్
తవ కటాక్ష వీక్షణం రోగ నివారణమ్
తవ మంత్రాక్షత రక్షణం శుభకరణమ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్

నమోస్తు వేద వ్యా స నిర్మిత ప్రతిష్ఠితాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయై
నమోస్తు అష్ఠ తీర్ధ జలమహిమాన్వితా యై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

నమోస్తు గోదావరీ తట నివాసిన్యై
నమోస్తు కృపాకటాక్ష స్వరూపాయై
సమోస్తు స్మృతిమాత్ర ప్రసన్నాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

నమోస్తు మనోహర పుష్పాలంకృతాయై
నమోస్తు జ్ఞాన మూలాయై జ్ఞాన గమ్యాయై
నమోస్తు గురుభక్తి రహస్య ప్రకటితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

నమోస్తు మండలదీక్షా భిక్షా మహాదాత్ర్యై
నమోస్తు మహామంత్ర తంత్ర ప్రవీణాయై
నమోస్తు సహస్రార చక్ర నిలయాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

నమోస్తు సర్వపాప సంహరికా యై
నమోస్తు యోగి యోగి నీ గణ సంసేవితాయై
నమోస్తు సకల కల్యాణ శుభదాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

రామదాసేన విరచిత మిదం పటతే భక్తి మాన్నరః
విద్యాం శ్రేయో విపుల సౌఖ్యం ప్రాప్నోతి

శ్రీ జ్ఞాన సరస్వతీ సంపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు

Basara Sree Jnana Saraswathi Devi is revered as the goddess of knowledge and education. Located in Telangana, the Basara temple is especially famous for the ritual of Aksharaabhyasam, where young children begin their formal education under the divine blessings of Saraswathi Devi. Daily recitation of the Bhakthi Dhara Stotram is believed to enhance educational success, wisdom, creativity, and cognitive abilities. Students who regularly chant this stotram are said to experience academic excellence and mental clarity. If you enjoyed this video, please like, share, and subscribe to our channel. Your support helps us bring more spiritual and devotional content to you.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

శ్రీజ్ఞానసరస్వతిఅమ్మవారు,బాసరసరస్వతిదేవి,అక్షరాభ్యాసం,విద్యాజయం,భక్తిస్థోత్రం,తెలుగు,భక్తి,SaraswathiStotram,TeluguStotram,DevotionalSongs,KnowledgeGoddess,SaraswathiMantra,BasaraTemple,EducationSuccess,AcademicExcellence,Saraswathi pooja for Education,Bhakthi Dhara Stotram,Jnana Dhara Stotram

Discover Divine Melodies with Bhakthi Unlimited’s Devotional Songs Collection


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply