Dwadashi Parayanam-Ambarisha Charitra-Vedanta Vedyude Adyantha Rahitha

Vedanta Vedyude

Dwadashi Parayanam-Ambarisha Charitra
Vedanta Vedyude Adyantha Rahitha

Here is a song which starts with Vedanta vedyude Adyanta Rahita from Ambarisha Charitra – Durvasa Garva Bhangam from the story of King Ambarisha

In the vast tapestry of ancient Indian scriptures, the story of Durvasa Garva Bhangam from the Ambarisha Charitra stands out as a timeless lesson in humility, devotion, and the power of true faith. This narrative, steeped in spiritual wisdom, offers profound insights that remain relevant to our lives today.

## The Story of Ambarisha and Durvasa

### The Devotion of King Ambarisha

King Ambarisha, a devout follower of Lord Vishnu, was renowned for his unwavering piety and dedication. His life was a testament to the principles of dharma (righteousness) and bhakti (devotion). Ambarisha observed the Ekadashi fast with great fervor, a practice that held immense spiritual significance. The culmination of this fast required the king to break it at a precise moment, a ritual known as Dvadashi Parana.

### The Test of Durvasa

The sage Durvasa, known for his fiery temper and formidable power, arrived at King Ambarisha’s palace during one such fast. In his hospitality, Ambarisha welcomed the sage and invited him to partake in the rituals. Durvasa, however, decided to test the king’s devotion and asked Ambarisha to wait until he returned from his bath before breaking his fast.

As the auspicious moment for breaking the fast approached, Ambarisha found himself in a dilemma. Respecting the sage’s wishes and adhering to the rules of the fast were both paramount. Choosing devotion to dharma, Ambarisha took a sip of water to technically break his fast, ensuring he adhered to both commitments.

### The Wrath and Realization of Durvasa

Upon his return, Durvasa was enraged by what he perceived as an affront to his authority and hospitality. In his anger, he summoned a powerful demon to destroy Ambarisha. However, Ambarisha remained calm and composed, placing his faith entirely in Lord Vishnu.

In response to the king’s devotion, the Sudarshana Chakra, Lord Vishnu’s divine weapon, emerged to protect Ambarisha. The Sudarshana Chakra chased Durvasa across the universe, causing the sage to seek refuge with various deities, but none could offer him protection.

Ultimately, Durvasa sought the mercy of Lord Vishnu, who directed him back to King Ambarisha, emphasizing the power of the king’s unwavering devotion. When Durvasa begged for forgiveness, Ambarisha, with his boundless compassion, prayed to the Sudarshana Chakra to spare the sage.

If you liked this video Please like, share and subscribe to our channel https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

### The Lessons of Durvasa Garva Bhangam

The story of Durvasa Garva Bhangam imparts several invaluable lessons:

1. **Humility and Ego: ** Durvasa’s anger stemmed from his ego, which clouded his judgment. His eventual realization underscores the importance of humility and the dangers of arrogance.

2. **Devotion and Faith: ** Ambarisha’s unwavering faith in Lord Vishnu exemplifies the power of true devotion. His calmness in the face of danger teaches us the strength that comes from genuine faith.

3. **Compassion and Forgiveness: ** Despite being wronged, Ambarisha’s compassion towards Durvasa highlights the virtues of forgiveness and understanding, even towards those who may harm us.

4. **Divine Protection: ** The story reaffirms the belief that sincere devotion and righteousness invoke divine protection. Ambarisha’s faith shielded him from harm, reinforcing the idea that the divine always supports the devout.

This story of Durvasa Garva Bhangam, from Ambarisha Charitra or the associated song is extremely auspicious and gives great benefits both physically and spiritually. This chanting has a special significance for both ekadashi and Dwadashi Parayana

Here is the full song, which you can listen to get the benefits

వేదాంత వైద్యుడే ఆద్యంత రహిత  ఆది నారాయణుని ఆత్మ లోదలతు

అంబరీషుడనియేటి పుణ్య చారిత్ర గోవింద దాసుల మహిమ వర్ణింతు

అట్టికానియు మునియు హరివాసముండి పరగ ద్వాదశి నాడు భక్తి తోడుగాను

ఆవు దానమ్ములే గోవు దానములు అంబరీష తాజేసె  అన్న దానములు

గంగి గోవును తెచ్చి కడు భక్తితోనూ కాళ్లకు రత్నాల అందెలే   గట్టి

పాడియావును తెచ్చి పసిడి కొమ్ములతో శృంగార గోవు దానమ్ములే చేసే

ఈ రీతి నుండగా దూర్వాస  మునియు వచ్చెను అంబరీష నగరికే వచ్చే

వచ్చిన ఆ మునికి వందనము చేసి అర్ఘ్య పాద్యమ్ములూ అతివేగ నిచ్చే

సలుపుదును ద్వాదశి హరి పూజ వేళా భిక్షకు రమ్మని భక్తి తో పిలిచే

వచ్చెద నని పోయి నది తీరమందు అమృతా స్నానాలు అటు చేయుచుండె

దేవతార్చన చేసి బ్రాహ్మణుల పిలచి రాడాయ  అని ముని భటుల నంపించె

పిలిచినా పలుకడూ పలుకాడాయెను జలములో కూర్చుండి జపము సాయెగను

ద్వాదశి పారణా వ్రతభంగమనుచు శ్రీతులసి పారణా  చేయవచ్చుననిరి

ఉదక పారణ చేసి ఊరకుండగను అంతట వచ్చెనే దూర్వాస మునియు

వచ్చిన ఆ మునికి వందనము చేసి అర్ఘ్య పాద్యములు అతివేగ నిచ్చే

కంచమ్ము బొట్టూను కావించి వేగా పంచ పదార్ధమ్ములూ పరగ వడ్డించే

నీ బంతి అన్నంబు నే కోరి వస్తి కూర్చుండు మమ్బరీష కుశలమ్ము గాను

ద్వాదశి పారణ వ్రతభంగమనుచు శ్రీతులసి పారణ చేసితి యనెను

నీ బంతి అన్నంబు నే కోరి వస్తే నీవెట్లు కుడిచితివి నీచుడా యనెను

అల్పుడ నీ చేతి అన్నంబు నేను వల్ల పొమ్మని ఒక్క జట  విప్పి వైచె

విప్పిన ఆ జటా వేయి విధములుగాను కారుచిచ్చై వచ్చి కాలుతూ మండే

కృష్ణ కృష్ణా యని కీర్తనలు  సాయ విష్ణు చక్రం వచ్చి మింగెనా మంట

అంతట పోనీక ఆ విష్ణుచక్రం దూర్వాస మహామునిని తరుముకొని పోయే

ఇలమందు జొచ్చెనే  బిలమందు జొచ్చె కొండలలో పెద్ద గుహలలో జొచ్చె

ఇహలోక భూలోక హరిలోకమందు దేవేంద్రుడున్నయా తావునకు పోయే

విష్ణుచక్రం నన్ను వెన్నాడుతోంది కావుము దేవేంద్ర తన్నని పలికే

ఏమి వరమడిగినా ఇచ్చేద కానీ విష్ణుతో విరుధంము కూడదని పలికే

కైలాస నగరికి కడువేగ వెళ్లి

విష్ణుచక్రం నన్ను వెన్నాడుతోంది కావుము కలకంఠ తన్నని పలికే

ఏమి వరమడిగినా ఇచ్చేద కానీ విష్ణుతో విరుధంము కూడదని పలికే

సత్య లోకమునకు కడువేగ చనియె బ్రహ్మకు తాను పడ్డ శ్రమలన్నీ తెలిపే

వెర్రి ముని నీవింత వెతలు పడనేల  ఆది అచ్యుతుడున్నఅచ్చ్చటకు పొమ్ము

పాపములు బాయును బంధములు విడునూ పరమాత్మడున్నయా తావునకు పొమ్ము

ముత్యాలు అమరించిన ముంగిళ్ళు దాటి పగడాలు అమరించిన పందిళ్లు దాటి

అపరంజి బంగారు గడపలే దాటి ఆణిముత్యంబులా తోరణముల దూరి

ఇంద్రుడు కొల్వగా చంద్రుడూగొల్వ గరుడుగొల్వగ  గంధర్వులూగొల్వ

అభయమీ యచ్యుత అనియేటివారు దాసానుదాసులం బనియేటివారు

 

వాసుదేవా కావు మనియేటివారు సనకసనందనులు సన్నుతులు సలుప

ఇనకులాధీశ్వరుడు ఇంపుతోనుండా ముసిముసి నవ్వులా ముకుందుడపుడు

 

అడవిలోనున్ననూ ఆకు నమిలిననూ ఎండకు ఎండినా ఏమి కారణము

విష్ణుచక్రం నన్ను వెన్నాడుతోంది కావుము శ్రీవిష్ణు తన్నని పలికే

 

భక్తి కారణముండె  పాండవులవారి బంటునై వారివారి వెంట తిరిగితిని

భక్తి కారణముండె యశోద నగరా కొడుకునై వారిచే  కొట్టుళ్ళుబడితి

 

భక్తి కారణముండె  ప్రహ్లాదుకొరకు స్తంభమున వెడలితిని సంభ్రమముగాను

భక్తి కారణముండె భృగు మహామునియు నొవ్వంగ తన్నితే నవ్వుతూనుంటి

 

భక్తి కారణముండె బలిచక్రవర్తి వాకిట గొల్లనై వసియింపుచుంటి

అయినాను హరిభక్తుడు ఆదినందనుడు అంబరీషుడున్నాయా తావునకు పొమ్ము

 

అంబరీషుడున్నాయా తావునకు పోయి నీకంటే సరియెవరు చేపట్టితీశు

కావుము అంబరీష తన్నని పలికే

విష్ణుచక్రం మిమ్ము తరిమినప్పూడు విష్ణుకధలు వీనులకు విందుగానుండు

పదివేల బ్రాహ్మణుల బంతిగూర్చుండి అడుగడుగు గోవిందా గోవిందా యనుచు

విష్ణు ప్రసాదము విందారగించే

అంబరీష చారిత్ర పాడినా విన్నా వారికి వైకుంఠమెదురుగా వచ్చు

 

శ్రీ కృష్ణార్పణం

Discover Divine Melodies with Bhakthi Unlimited’s Devotional Songs Collection


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply