fbpx
Menu Close

April 2019

దొండకాయ కొత్తిమీర కారం కూర

కావలసినవి : దొండకాయలు –పావుకిలో కొత్తిమీర -ఒక కట్ట పచ్చిమిర్చి –ఆరు ఉప్పు –తగినంత ఆయిల్ –సరిపడ తయారీ పద్దతి:దొండ కాయలు సన్నగా చీలికలుగా తరగాలి .స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా మిక్సి పట్టాలి ..ముక్క బాగా మెత్తబడ్డాక యి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి .సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వే చేయాలి . యిది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది .

మామిడికాయ పప్పు

కావలసిన పదార్థాలు: పప్పు –మూడుకప్పులు మామిడికాయ -పెద్దది ఒకటి ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావు స్పూన్ మెంతులు-పావుస్పూన్ ఎండుమిర్చి –రెండు పచ్చిమిర్చి –రెండు కరివేపాకు -రెండు రెమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు –తగినంత వెల్లుల్లి పాయలు –రెండు కొత్తిమీర –కొద్దిగా తయారీ పద్ధతి :పప్పుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పకనపెట్టాలి .మామిడి కాయకి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి ఉడక బెట్టాలి .మెత్తగా మెదిపి పప్పులో వేసి కలపాలి.స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి పాయలు వేసి వేగనివ్వాలి.తరువాత ఆవాలు ,జీలకర్ర ,కరివేపాకు ,మెంతులు ,ఎండుమిర్చి ,పచ్చిమిర్చివేసి వేగాక పోపుని…