fbpx
Menu Close

March 2019

బీరకాయ పోపు కూర

కావలసిన పదార్ధాలు:బీరకాయలు -ఒక కిలో(తొక్క తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి )వెల్లులి పాయలు –రెండుపచ్చిమిర్చి –రెండుమినప పప్పు -ఒక స్పూన్జీలకర్ర—ఒకస్పూన్ఆవాలు-పావుస్పూన్ కరివేపాకు –రెండురేమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు -తగినంత తయారి పద్దతి:స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.ఆయిల్ వేసి వేడి చేయాలి.ఆయిల్ వేడెక్కిన తరువాత వెల్లులి పాయలు వేసి వేపాలి తరువాత మినపపప్పు ,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు ,పచ్చిమిర్చివేసి వేయించాలి.అందులో బీర కయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి .అయిదు నిమిషాల తరువాత మూత తీసి ముక్క మెత్తబడితే అందులో తగినంత ఉప్పు వేసి కలిపి హై ఫ్లెం మీద నీరు యిమ్కనివ్వాలి.దీనిని సర్వింగ్ బౌల్ లోకి…

ఆనపకాయ పోపుకూర

కావలసినవి: ఆనపకాయ –ఒకటి పచ్చిమిర్చి-ఒకటి మినపపప్పు -ఒక స్పూన్ సెనగపప్పు –ఒకస్పూన్ ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావుస్పూన్ కరివేపాకు –ఒకరెమ్మ ఉప్పు –తగినంత ఆయిల్ -టూస్పూన్స్ తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేయాలి . మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు, జీలకర్ర,కరివేపాకు,పచ్చిమిర్చి,వేసి వేయించాలి. తరువాత ఆనపకాయ ముక్కలు వేయాలి . కొంచెం నీరు పోసి మూతపెట్టాలి.  అయిదు నిమిషాల తరువాత మూత తేసి చూడాలి ముక్క ఉడికాక కొంచెం ఉప్పు వేసి కలిపి స్టవ్ హైలో పెట్టి నీరు యింకనివాలి. ఆనపకాయ పోపు కూర తయారు. ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది. చపతిలోకి కూడా…

ఆనపకాయ పెసరపప్పు కూర

కావలసిన పదార్థాలు:ఆనపకాయ-ఒకటి(సన్నగా తరిగి పక్కన పెట్టాలి)పెసరపప్పు-ఒక కప్పు(అరగంటసేపునానబెట్టుకోవాలి)ఉప్పు-తగినంతపచ్చిమిర్చి-ఒకటిజీలకర్ర-పావుస్పూన్ఆవాలు-పావుస్పూన్ఇంగువ-కొంచెంఆయిల్-ఒకస్పూన్కరివేపాకు-ఒకరెమ్మతయారీ పద్దతి:ఆనపకాయ ముక్కల్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలితరువాత స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.అందులోఒక స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాకఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి, కరివేపాకు,ఇంగువ వేసి వేయించి పెసర పప్పువేసి కలపాలి.కొంచెంనీరు పోసి కలిపి మూతపెట్టాలి.అయిదునిమిషాల తరువాత మూత తీసి కలిపి అందులో ఉడకపెట్టిన ఆనపకాయ ముక్కలువేసి  కలపాలి.తగినంతఉప్పు కొద్దిగావేసి కలపాలి .ఆనపకాయ పెసరపప్పుపొడి కూర తయారు.యిది వేడి వేడి అన్నం లోకి  బాగుంటుంది .

ఆనపకాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలుఆనపకాయ-ఒకటిపెరుగు-ఒక కప్పుపచ్చిమిర్చి-ఒకటిమినపప్పు-ఒకస్పూన్జీలకర్ర-ఒక స్పూన్ఆవాలు-పావుస్పూన్నీయి-ఒక స్పూన్కరివేపాకు-ఒకరెమ్మఉప్పు-తగినంతతయారిపద్దతి; ఆనపకాయని సన్నగా కట్ చేసుకోవాలి.ఆ ముక్కలు ఉడకబెట్టి ;నీరుతీసేయాలి.చల్లారాక దీనిని పెరుగులో కలపాలి స్టవ్ పైన కడాయిపెట్టి వేడయ్యాకమినపప్పు,ఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి,కరివేపాకు,నేయివేసి తాలింపుపెట్టాలి.దానకి సరిపడఉప్పు వేసి కలపాలిఆనపకాయ పెరుగు పచ్చడిరెడీ