fbpx
Menu Close

March 2019

వెజ్ చనా చోలి

బయట చూస్తే చల్లటి వాతావరణం, ఇంట్లో వేడి వేడి చాట్స్ చేసుకుని తినాలని ఉందా..? అయితే సూపర్ “వెజ్ చెన్నా చోలీ”ని రెడీ చేసుకుని వేడి వేడిగా టేస్ట్ చేయండి.వెజ్ చెన్నా చోలీ ఎలా చేయాలంటే:ముందుగా ఆలూ, బీన్స్ క్యారెట్, క్యాబేజి, కాలిఫ్లవర్, కాప్సికమ్..” వీటినన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆఫ్ బాయిల్ చేసుకుని (ఆఫ్ బాయిల్ చేసిన కూరగాయల ముక్కలు: ఒక కప్పు) పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బాగా నానిన తెల్లశెనగల్లో కొంచెం ఉప్పు, ఒక అర చెంచా నూనెతో పాటు ఒక పలుచని వస్త్రంలో అర చెంచా టీ పొడి వేసి…

క్యాబేజీ కార్న్ కూర

కావాల్సినవి: సన్నగా తరిగి పలుకుగా ఉడికించిన క్యాబేజి – ఒక కప్పు, ఒక కప్పు ఉల్లి ముక్కలు గుండ్రంగా తరిగిన బేబీ కార్న్ ముక్కలు ఒక కప్పు సరిపడినన్ని జీడిపప్పు ముక్కలు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఒక రెబ్బ, పచ్చిమిర్చి 1 ఒక అంగుళమంత కొబ్బరి ముక్క ఉప్పు -తగినంతతయారు చేసే విధానం: మూకుడులో నూనె పోసి వేడెక్కాక, జీడిపప్పులు వేసి, గోధుమ వర్ణంలోకి రాగానే, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. సగం వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మంచి ఘుమాయింపు రాగానే, కరివేపాకు, కొత్తిమీర వేసి మరికొంచెం సేపు…

పుదీనారైస్

కావలసిన పదార్థాలు:పుదీనా – 2 కట్టలు, బాస్మతి బియ్యం – 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము – పావుకప్పు , పచ్చిమిర్చి – 3 , ఉల్లిపాయ – ఒకటి ( సన్నగా తరగాలి) , అల్లం వెల్లుల్లి – 1 టీస్పూన్‌, లవంగాలు – 4 , యాలకులు – 4 , దాల్చిన చెక్క – 4 , పలావు ఆకులు – 4 , అనాసపువ్వు – ఒకటి, వేయించిన జీడిపప్పు – పావుకప్పు, నెయ్యి – 2 టీస్పూన్లు ఉప్పు – సరిపడినంత.తయారు చేసే విధానం:ముందుగా పుదీనా ఆకులను తుంచుకొని బాగా…

బీరపోట్టు పచ్చడి

కావలసినవి : బీరతోక్కలు -మూడు కాయలవి చింతపండు-పులుపుకు తగినంత ఎండుమిర్చి –అయిదు ఉప్పు –తగినంత ఆయిల్ -వేపడానికి సరిపడ వెల్లుల్లి రెబ్బలు –అయిదు మినపపప్పు –ఒకస్పూన్ జీలకర్ర –ఒకస్పూన్ తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడి అయినాక ఆయిల్ వేసి వేడి చేయాలి .బీర పొట్టు వేసి బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా వేయించాలి .దీనిని పక్కన పెట్టాలి .కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మినపపప్పు ,జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేయించాలి .యిపుడు బీరపోట్టు ,ఎండుమిర్చి ,చింతపండు ,ఉప్పు ,వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి .యిందులోమినపప్పు ,జీలకర్ర వేసి…

బీరకాయ ఉల్లికారంకూర

కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి కొంచెం పెద్దముక్కలుగా తరగాలి ) ఉల్లిపాయలు –అయిదు(పెద్దముక్కలుగా తరిగి పేస్ట్చేసి పక్కన పెట్టాలి ) ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత కారం -తగినంత తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి .స్టవ్ సిమ్లో ఉంచాలి . అయిదు నిమిషాల తరువాత మూత తేసి ముక్క మెత్తగా అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి మూతతీసి వేయించాలి .ఉల్లి ముద్దబ్రౌన్ కలర్ లోకి వచ్చాక తగినంత ఉప్పు ,తగినంత కారంవేసి రెండు నిముషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి…

బీరకాయ పోపుకారం కూర

కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి సన్నగా తరగాలి ) మినపపప్పు –నాలుగుస్పూన్స్ శెనగపప్పు-నాలుగు స్పూన్స్ ధనియాలు -నాలుగు స్పూన్స్ ఎండు మిరపకాయలు –ఆరు ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత తయారిపదతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .శెనగపప్పు ,మినపపప్పు ,ధనియాలు ,ఎండు మిరపకాయలు ,వేసి వేయించాలి .వేగాక దాన్ని చల్లారనివ్వాలి.తరువాత దీని పౌడర్ చేయాలి .పౌడర్ లో ఉప్పుకూడా వేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి .అయిదు నిమిషాల తరువాత మూత తీసి చూసి ముక్కలు మెత్తగా అయ్యాక…

బీరకాయ పప్పుకూర

కావలసిన పదార్థాలు: బీరకాయలు -ఒక కిలో (పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి) కందిపప్పు -ఒకకప్పు వేల్లులిపాయలు –రెండు కరివేపాకు -రెండు రెమ్మలు జీలకర్ర-పావు స్పూన్ ఆవాలు -పావు స్పూన్ ఎండు మిరపకాయలు –ఒకటి ఉప్పు –తగినంత ఆయిల్ -రెండు స్పూన్స్ తయారీ పద్ధతి:కుక్కర్ లో పప్పు బీరకాయ ముక్కలు వేసి నీరు పోసి మూడువిజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టాలి .కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి వేడిచేయాలి .తరువాత వెల్లుల్లి పాయలు వేయించి కరివేపాకు ,జీలకర్ర,ఆవాలు ,ఎందుమిరపకయముక్కలు ,వేగాక తగినంత ఉప్పు వేసి ఉడికిన పప్పు, ముక్కలు వేసి కలిపి నీరు యిగిరిపోయేదాకా ఉంచి…