కావలసిన పదార్థాలు :
టొమోటోలు.. పావు కేజీ
మెంతికూర.. ఒక కప్పు
కొబ్బరికోరు.. ఒక టీ
ఉల్లిపాయ.. ఒకటి
కారం.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
అల్లం, వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.
నూనె.. ఒక టీ.
ధనియాలపొడి.. ఒక టీ.
కరివేపాకు.. రెండు రెబ్బలు
కొత్తిమీర.. తగినంత
జీలకర్ర, ఆవాలు.. ఒక టీ.
తయారీ విధానం :
కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి. శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చివాసన పోయేంతదాకా వేయించాలి. తరువాత టొమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి. అందులోనే కారం, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరికోరు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం కాస్త ముద్దగా అయిన తరువాత దించేసి, చివర్నో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మెంతి టొమోటో కర్రీ తయార్.! దీన్ని వేడి వేడి అన్నంలోగానీ, చపాతీల్లోగానీ కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కూడా..
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.
Absolutely with you it agree. In it something is also to me it seems it is excellent thought. Completely with you I will agree.
I consider, that you have misled.
It has surprised me.