శ్రీ పార్వతీ దేవి మేలుకొలుపు | Sree Parvathi Devi Melukolupu 

మేలుకో పార్వతీ మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో
మేలుకో భగవతీ మేలుకో గుణవతీ మేలుకో శివసతీ మేలుకో

శివచెంత ముదమంది చిన్మయంబుగాను నిదురించు పార్వతీ మేలుకో
తొలికోడి కూసింది తూరుపు తెలవారే కలికి నిద్దురబోక మేలుకో

మేలుకో పార్వతీ మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో
మేలుకో భగవతీ మేలుకో గుణవతీ మేలుకో శివసతీ మేలుకో

అరవిందమప్పుడే అందాల గల్గె మురసి నిను చెలదలిచెను మేలుకో
కరివేరు మందార కమ్మని కంఠ సరసముగ నిను పిలిచెను మేలుకో

మేలుకో పార్వతీ మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో
మేలుకో భగవతీ మేలుకో గుణవతీ మేలుకో శివసతీ మేలుకో

మేలుకో పార్వతీ మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో
మేల్కునీ మాకియ్యవలె మేలైన సంపదలు సావిత్రి కిడినట్లు మేలుకో

శర్వాణి మేల్కుని యుర్వినీ మాకియ్యవే సర్వ సంపదలను సరయతను
ఆదరామారంగ మోదము తీరంగ నీదయా మాకియ్యవే మేలుకో

మేలుకో పార్వతీ మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో
మేలుకో భగవతీ మేలుకో గుణవతీ మేలుకో శివసతీ మేలుకో

Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply